నేటి రాజకీయం
Written by Bhanuchandara
అధికారమే . ..పరమావధిగా నేటి రాజకీయం.
నేటి నాయకులూ ఎవరైనా సరే..వారు
నేడు సామ దాన బేధ దండోపాయాల మంత్రాలతో రాజకీయముగా అధికారాన్ని చేజిక్కించుకుంటున్నారు.
ఒక్కొక్కరు ..ఒక్కో పద్దతి.
అలాగే కొన్ని మతాలు కూడా పనికిరాని సాయం పేరుతొ అమాయకుల్ని లోబర్చుకుంటూ.. దేవుడ్ని నమ్మినందుకు తెల్లారేసరికి మాటలు రాని మూగవాడికి మాటలు వచ్చేసేయంటూ మాయ మాటలతో ప్రజల్ని బురిడీ కొట్టిస్తూ...మాయ చేస్తున్నట్లు..రాజకీయ నాయకులు కూడా తమని నమ్ముకున్న ప్రజల్ని కూడా పబ్లిసిటీ పేరుతొ మోసం చేస్తూ పబ్బం గడుపుతున్నారు.
దీనికి ప్రత్యక్ష ఉదాహరణే ఆంధ్రప్రదేశ్ లోని బెండపూడి స్కూల్.
భావిభారత పౌరులకు ఆదర్శముగా నిలవాల్సిన టీచర్స్ (మనం) ..పిల్లలకు తప్పుడు మార్గం చూపిస్తూ ఆదర్శముగా నిలుస్తున్నాం.
ఇదేనా మన పిల్లలకు మనం చెప్పే నీతి. ఇదేనా మన పిల్లలకు మనమిచ్చే సందేశం.
ఎక్కువ శాతం ప్రజలు ఈజీ మనీ కోసం లేజీ గా తయరవుతున్నాడు. కష్టపడటమంటే చాల పరువు తక్కువగా భావిస్తున్నారు.
ప్రపంచమే తెలియని పిల్లల చేత నాలుగు ఇంగ్లీష్ మాటలు బట్టి పట్టించి..అమెరికన్ స్టైల్ లో పిల్లల చేత మాట్లాడించి..వాటిని తమ సోషల్ మీడియాలో తమ ప్రభుత్వ ఘనతగా చెప్పుకుంటూ అమాయక ప్రజల్ని మాయ చేస్తున్న వైనం..చాల సిగ్గు పడాల్సిన విషయం.
ఉషాకుమారి గారు కనుక విజిట్ చేయకపోయుంటే...ఈ విషయం వెలుగులోకి వచ్చేది కాదు.
కానీ ఆలా కాకుండా తమ ప్రభుత్వం వచ్చిన తరువాతనే ఇది సాధ్యమైందంటూ..నాలుగు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడించడం...దాన్ని విరివిగా పబ్లిసిటీ చేసుకోవడం ఎంత వరకు సమంజసం?
ఆ పబ్లిసిటీని నిజమని నమ్మి... దాన్ని ప్రచారం చేయటం.. ఇదుగో తోక అంటే అదుగో పులి అన్నట్లు ఉంది మన వ్యవహారం.
సోషల్ మీడియాలో విపరీతమైన ట్రెండింగ్ చేస్తూ మనం..మన రిలేషన్స్ మరిచి సోషల్ గా ఫైట్ చేస్తుంటాం.
నిజముగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటె ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి ఒక్క పిల్లలకు
ఇంగ్లీష్ అనర్ఘళముగా మాట్లాడించడం పెద్ద విషయమేమి కాదు.
ప్రజలు బాగా చదువుకుంటే వీళ్ళు కుర్చీలు మాయమవుతాయని భయం.
అందుకే ఎన్నో పథకాలు అందిస్తూ మత్తులో ముంచేస్తుంటారు.
ప్రజల్ని అంధకారంలో ఉంచి.. రాజకీయ స్వార్ధపు మత్తులో...నమ్ముకున్న ప్రజల్ని కాటేస్తున్న ఈ వ్యవస్థనేమనాలి.
వాళ్లేమో వాళ్ళ రాజకీయ వారసత్వాన్ని వాళ్ళ పిల్లలకి అందిస్తుంటే
మనమేమో మన బానిస బ్రతుకులను పిల్లలకు వారసత్వముగా సంక్రమింపచేద్దామా!
ఎవరి కోసం ...? ప్రజలారా ఒక్కసాగారి ఆలోచించండి?
పబ్లిసిటీ యావలో ప్రజల్ని మోసం చేయటం అవసరమా!
వినేవాడుంటే చెప్పేవాడు ఎన్ని రకాలైన చెపుతాడన్న ఇంగితం మనకుండాలి కదా!
మనం కూడా నిజ నిజాలు తెలుసుకోకుండా గుడ్డిగా నమ్మేయడమేనా!
ఇలానే ఉంటె మీ పిల్లలు రేపు ఏ పని చేయలేక..ఏ పని చేద్దామన్న చేతకాక సోమరిగా..చవట దద్దమ్మల ఉంటె సరిపోతుందా!
ప్రపంచమంతా ముందుకు పోతుంటే...మనమేమో వెనక్కి ప్రయాణిస్తున్నాం.
మన ప్రయాణం ..ముందుకొ..వెనక్కో ఆలొచించండి.
మీ అభిమానాన్ని పక్కన పెట్టండి..ఒక్కసారి విచక్షణతో ఆలోచించండి..విజ్ఞతతో వ్యవహరించండి.
మీకే అర్థమవుతుంది...ఎవరు ఎలాంటి మోసాలు చేస్తున్నారో....
Comments
Post a Comment